మండల కేంద్రం సంతబొమ్మాళి గ్రామ పంచాయతీ పరిధిలో రైతులకు సాగునీరు అందించేందుకు కాలువలో పూడిక తీత పనులకు మంత్రి అచ్చెన్న ఆదేశాలతో సోమవారం భూమి పూజ చేశారు. 13ఎల్ కాలువ గుర్రపు డెక్కతో నిండి పోయి సాగు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాజీ సర్పంచ్ కూచెట్టి కాంతారావు, అల్లు రమేష్, చల్ల జగ్గారావు, పప్పు కృష్ణ రావు, పేరిశెట్టి దశరదరావు, సాదు గణపతి, కల్లాడ శివ పాల్గొన్నారు.