యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీమెన్స్ కంపెనీతో కుదుర్చుకున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో చంద్రబాబు తన అవినీతి స్కిల్ చూపించారని టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. ఒప్పందంలో సీమెన్స్ కంపెనీ వాటా రూ. 3, 300 కోట్లు కాగా. రాష్ట్ర ప్రభుత్వ 10 శాతం వాటాగా ఉన్న రూ. 371 కోట్లను ముందుగానే విడుదల చేసి ఆ నిధులను చంద్రబాబు తన బినామీ కంపెనీలకు తరలించారని టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ స్కాంను చంద్రబాబు అండ్ కో చాల పకడ్బందీగా అమలు చేసారని విమర్శించారు. ఆదివారం నాడు టెక్కలి లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి నలుగురు అరెస్ట్ అయ్యారని, త్వరలో చంద్రబాబు కూడా జైలుకి వెళ్లడం ఖాయమన్నారు.