రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు కోరిన విధంగా ధాన్యాన్ని అమ్మకాలు నిర్వహించవచ్చునని, ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిందని ఆర్డిఓ కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం కోటబొమ్మాలి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఏ సిఎస్ అధ్యక్షులు కింజరాపు హరి ప్రసాద్ కొనుగోలు ప్రక్రియను చేపట్టారు. కార్యక్రమంలో ఏడి తిరుమలరావు పాల్గొన్నారు.