కోటబొమ్మాళి: అమ్మవారి సేవలో మంత్రి అచ్చెన్న

57చూసినవారు
కోటబొమ్మాళి: అమ్మవారి సేవలో మంత్రి అచ్చెన్న
కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు శనివారం మంత్రి అచ్చెన్నాయుడు ఆయన నివాసం వద్ద పండితులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన అనంతరం ఆయుధ పూజ చేపట్టారు. నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని, కష్టాలు లేకుండా ప్రజలు సంతోషంగా జీవితాన్ని గడపాలని కోరుకున్నట్లు తెలిపారు. స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్