తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు 'నాఇల్లు - నా సొంతం' కార్యక్రమంలో భాగంగా శనివారం పలాస కాశీబుగ్గలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు హుద్ హుద్ తుపాన్ సమయంలో గూడు లేని నిరుపేదలకు నిర్మించిన 199 ఇల్లును అర్హులైన పేదలకు వెంటనే అందించాలని కోరారు. లేనియెడల జనవరి మాసంలో టిడిపి అర్హులైన నిరు పేదలను వెంటతీసుకొచ్చి బలవంతపు గృహప్రవేశాలు చేస్తామని ఈసందర్భంగా హెచ్చరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాద యాత్ర అధికారంలోకి వచ్చేందుకు తప్ప ప్రజల అభివృద్ధికి, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పోయారని విమర్శించారు. యువతకు నిరుద్యోగ భృతి తీసేయడం వల్ల కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే, పెన్షన్ ఆగస్టు నుంచి 250 రూపాయలు పెంచుతామన్న విషయాన్ని మరిచిన ప్రభుత్వం. ప్రభుత్వ అధికారులపై దాడులు ఆపాలని, మందస మండలం లోని ప్రధానోపాధ్యాయుడు పై గ్రామ వాలంటీర్ చెప్పుతో కొట్టిన ఘటన ఈ సందర్భంగా గుర్తు చేశారు.