కోటబొమ్మాళి మండలం మండలం పొడుగుపాడు సమీపంలో జాతీయ రహదారిపై మైలురాయి 570/200 వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వెళ్తున్న లారీని మరో లారీ అధికమించే క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అందుబాటులో ఉన్న ప్రైవేటు వాహనంలో కోటబొమ్మాళి ఆసుపత్రికి గాయపడిన వ్యక్తిని తరలించారు. హైవే (1033) సిబ్బంది ట్రాఫిక్ ను క్రమబద్దీకరించగా, కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.