మేఘవరంలో రామోజీరావుకి టిడిపి శ్రేణులు నివాళులు

63చూసినవారు
మేఘవరంలో రామోజీరావుకి టిడిపి శ్రేణులు నివాళులు
సంతబొమ్మాళి మండలం‌ మేఘవరం పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతిపై సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రామోజీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించి వారి సేవలను కొనియాడారు. మేఘవరం గ్రామంలో ఈనాడు రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు హుదూద్ ఇళ్లను అందించిన ఘనత రామోజీరావుకే దక్కిందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.