టెక్కలిలో భర్త ఇంటి ముందు భార్య నిరసన

606చూసినవారు
టెక్కలిలోని రామదాసుపేట వీధిలో శనివారం భర్త ఇంటికి తాళం వేసి భార్య నిరసన తెలిపింది. టెక్కలికి చెందిన కోతి రామకృష్ణ, సుహాసిని దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కాగా తన భర్త భారతి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమకు అన్యాయం చేస్తున్నాడని సుహాసిని తన కుమారుడు పవన్, కుమార్తె ఝాన్సీరాణితో కలిసి ఇంటి ముందు నిరసన తెలిపింది. భర్త వేరే మహిళతో ఇంట్లో ఉండగా సుహాసిని ఆ ఇంటికి తాళం వేసింది.

సంబంధిత పోస్ట్