ఏపీలో 15 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు

56చూసినవారు
ఏపీలో 15 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు
ఏపీలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు HCL సన్నాహాలు చేస్తోంది. ఐటీశాఖ మంత్రి లోకేష్‌తో HCL కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ భేటీ అయ్యారు. ఏపీలో మరో 15 వేల ఉద్యోగాల కల్పనకు సుముఖత వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న స్కిల్ సెన్సస్‌లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామని ప్రకటించారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్