పోస్టల్ బ్యాలెట్‌పై నేడు సుప్రీంలో విచారణ

57చూసినవారు
పోస్టల్ బ్యాలెట్‌పై నేడు సుప్రీంలో విచారణ
ఏపీ పోస్టల్ బ్యాలెట్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్‌పై వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి సుప్రీంకోర్టు కేవియట్ దాఖలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కేసులో వైసీపీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంలో సవాలు చేసింది.

సంబంధిత పోస్ట్