AP: ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ ఒక సంచలనం, రాజకీయ అవసరమని అన్నారు. TDPకి తాను టీమ్ లీడర్‌ని మాత్రమే అని, మనం వారసులం మాత్రమే కానీ పెత్తందార్లము కాదని తెలిపారు. తనకు అప్లికేషన్లు పెట్టుకుంటే పదవులు రావని, క్షేత్రస్థాయిలో పని చేసిన వారికే పదవులు వస్తాయని స్పష్టంచేశారు. 'గుప్తుల కాలం స్వర్ణయుగం అంటారు. అలాగే టీడీపీది స్వర్ణయుగం' అని చంద్రబాబు అభివర్ణించారు.