AP: తెలుగువారు ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ ‘పార్టీకి మనమంతా వారసులం మాత్రమే.. పెత్తందారులం కాదు. నేను కూడా పార్టీకి అధ్యక్షుణ్ని.. టీమ్ లీడర్‌ను మాత్రమే. ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలి. చరిత్రలో టీడీపీ నాటి స్వర్ణ యుగం అని చెప్పుకొనే రోజులు శాశ్వతంగా వస్తాయి’ అని చంద్రబాబు అన్నారు.