AP: నితీశ్ కుమార్ సెంచరీ చేసిన నేపథ్యంలో అతని కుటుంబం ఎమోషనల్ అయిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. దీనిపై నారా భువనేశ్వరి స్పందిస్తూ.. ''కుటుంబ మూమెంట్ ను బంధించిన అందమైన వీడియో ఇది. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది నితీశ్. తన సెంచరీతో కుటుంబాన్ని గర్వపడేలా చేశాడు. అతనికి మద్దతు పలికిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. తెలుగు సమాజం గర్వపడేలా చేశాడు'' అని ట్వీట్ చేశారు.