ఏపీలో న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. ఈ మేరకు కొత్త సంవత్సరం వేళ పాటించాల్సిన నిబంధనలను సీపీ సుధీర్ బాబు ఆదివారం ప్రకటన ద్వారా తెలియజేశారు. విజయవాడలో డిసెంబర్ 31న రాత్రి ఫ్లైఓవర్లు, పశ్చిమ బైపాస్‌పై ట్రాఫిక్ నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. బెంజ్ సర్కిల్, కనకదుర్గా ఫ్లైఓవర్లు, బందర్, ఏలూరు, బీఆర్‌టీఎస్ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయన్నారు. మద్యం తాగి రోడ్ల మీదికి వస్తే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.