మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారక నిర్మాణం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఈ అంశంపై పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్ రావు మాట్లాడుతూ..కాంగ్రెస్‌పై మండిపడ్డారు. పీవీ నరసింహారావు మరణిస్తే ఆయన భౌతికకాయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కూడా ఉంచడానికి అనుమతించలేదని, స్మారక చిహ్నం నిర్మిస్తామని ఇప్పటి వరకు నిర్మించలేదని విమర్శించారు.