పోలీస్ ఆఫీసర్ అంటూ ఫేక్ కాల్.. ఏం చేశాడో చూడండి (వీడియో)

61చూసినవారు
ఇటీవల ఆన్‌లైన్ మోసాలు మరింత పెరిగిపోయాయి. ఫ్రాడ్ మెసేజులు, లింకులు పంపి ప్రజలను స్కామర్లు మోసం చేస్తున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసంతో ముందుకొచ్చారు. అయితే, ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఓ ఫ్రాడ్ కాల్‌కి తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఓ వ్యక్తి వీడియో కాల్ చేయగా, అది ఫ్రాడ్ కాల్ అని గ్రహించిన సదరు వ్యక్తి తన కుక్క పిల్లను కెమెరా ముందు ఉంచి ఓ ఆట ఆడుకున్నాడు. దీంతో అటు పక్క వ్యక్తి కాల్ కట్ చేశాడు.

సంబంధిత పోస్ట్