లారీని ఢీకొట్టిన బస్సు.. డ్రైవర్ స్పాట్‌ డెడ్ (వీడియో)

61చూసినవారు
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆరెంజ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. జియో కేబుల్ కోసం తీసిన గోతిలో బస్సు ఇరుక్కోవడం పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ, బస్సు ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్