APలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి TDP సిద్ధమైంది. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి
టీడీపీ సర్వం సిద్ధం చేసింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయన సొంత నియోజకవర్గంలో రెండు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి, చిన్న మార్కెట్ వద్ద రెండు అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. ఈనెల 16వ తేదీ శుక్రవారం ఉదయం బాలకృష్ణ రెండు అన్న కాంటీన్లు ప్రారంభించనున్నారు.