IPL-2025లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:00 గంటలకు టాస్ పడనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్‌లో కేకేఆర్, ముంబై జట్లు ఇప్పటివరకు మొత్తం 34 సార్లు తలపడ్డాయి. కాగా వీటిలో ముంబైదే పైచేయిగా ఉంది. ముంబై ఇండియన్స్ 23 మ్యాచ్‌ల్లో గెలవగా, కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం 11 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది.