AP: 2047 కల్లా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55 లక్షలు ఉండాలని, 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు చేరాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. 'దేశంలో అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. వికసిత్ భారత్-2047 కల్లా దేశం 30 ట్రిలియన్ డాలర్ల GDPకి చేరాలి. రాష్ట్రంలో నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలుపరిచే బాధ్యత MLAలదే. విజన్ డాక్యుమెంట్ అమలుకు ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తాం' అని తెలిపారు.