రంజాన్‌లో ఉపవాసం విరమించేటప్పుడు ఎక్కువ మంది ఖర్జూరం తీసుకుంటారు. ఇది శక్తిని వెంటనే అందించడంతో పాటు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఖర్జూరాల్లో పీచు, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అలాగే వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల హైడ్రేషన్‌కు సహాయపడుతుంది. ఉపవాసం అనంతరం వీటిని తినడం జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. సహజ చక్కెరలు, ఫైబర్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది.