పుచ్చసాగు చేపట్టాలనుకునే రైతులు మేలైన విత్తన రకాలను ఎంచుకోవాలి. ప్రస్తుతం మార్కెట్‌లో అసాహి యమాటా, షుగర్ బేబి, ఆర్క జ్యోతి, ఆర్క మానిక్ వంటి రకాలతో పాటు, నాంధారి 295 వంటి రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటితో పాటు నారింజ రంగు కండ కలిగిన పూసా వర్ధతి, పూసా మధురసి, పంజాబ్ సున్హేరి కూడా సాగులో ఉన్నాయి.