ఏపీలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తమను ప్రేమించడం లేదనే కారణంతో యువతులపై దాడులకు తెగబడుతున్నారు. తూ.గో. జిల్లాలోని నల్లజర్లలో గుర్రాల రాజు (23) అనే వ్యక్తి యువతిపై దాడి చేశారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. యువతి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే నంద్యాల జిల్లాలో రాఘవేంద్ర అనే యువకుడు ఇంటర్ చదువుతున్న లహరి అనే యువతి ఇంటికి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాంతో లహరి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.