బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్‌పోర్టును రద్దు చేసింది. దీనిపై తాజాగా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. హసీనాతో పాటు మరో 96 మంది పాస్‌పోర్టులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజర్వేషన్లపై గతంలో ఆ దేశంలో అల్లర్లు జరిగాయి. ఈ కేసుల విచారణ జరుగుతున్నందు వల్ల ఈ చర్య తీసుకున్నట్లు బంగ్లా ప్రభుత్వం వెల్లడించింది.