జగన్‌పై ఉన్నన్ని కేసులు దావూద్‌ ఇబ్రహీంపైనా ఉండవేమో!

1060చూసినవారు
జగన్‌పై ఉన్నన్ని కేసులు దావూద్‌ ఇబ్రహీంపైనా ఉండవేమో!
సీఎం జగన్‌పై ఉన్నన్ని కేసులు దావూద్‌ ఇబ్రహీంపైనా ఉండవేమోనని సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. ‘సీఎం జగన్‌పై 38 క్రిమినల్‌ కేసులున్నాయి. ఇందులో 11 సీబీఐ నమోదు చేసినవి. 7 ఈడీ దాఖలు చేసినవి. దాదాపు ఇవన్నీ 13 ఏళ్లుగా విచారణ దశలోనే ఉన్నాయి. 146 నేరాభియోగాల్లో ఆయనే నిందితుడిగా ఉన్నారు. ఇవన్నీ 2019 ఎన్నికల అఫిడవిట్‌లో జగనే స్వయంగా పేర్కొన్నారు‘‘ అని ట్వీట్‌ చేశారు. దావూద్‌పై కూడా ఇన్ని కేసులు లేవన్నారు.

సంబంధిత పోస్ట్