గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భూ సర్వేలో లోపాలున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ మేరకు కేంద్ర భూ వనరుల శాఖ కార్యదర్శి మనోజ్ జోషికి వివరించారు. వీటన్నింటినీ సవరించి భూ రికార్డులను సరి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన భూ రీ సర్వే, భూ రికార్డుల డిజిటలీకరణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.