గొర్రె పిల్లలను పుట్టిన మొదటి 3 రోజులు తల్లితోపాటు వెచ్చని వాతావరణంలో ఉంచాలి. అలాగే పిల్ల శరీర బరువులో 20 శాతం జున్నుపాలను ప్రతిరోజూ అందించాలి. మొదటి రెండు వారాలు తల్లిపాలమీదనే ఉంచాలి. పుట్టిన పిల్ల శరీర బరువు 3 కిలోలు ఉంటే రోజుకి 600 మిల్లీ లీటర్ల పాలు అవసరం. ఒకవేళ తల్లివద్ద సరిపడనంత పాలు లేకపోతే ఆవు లేదా గేదె పాలను అదనంగా అందించాలి. 3వ వారం నుంచి 7 వారాలవరకు క్రీపు దాణా అందించాలి.