AP: రెడ్‌బుక్ పేరు చెబితేనే వైసీపీ నేతలు భయపడిపోతున్నారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ‘రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి కొట్టేందుకు ప్రజలు మరోసారి సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు మర్చిపోయి సుద్దపూసలా మాట్లాడుతున్నారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. జ్ఞానం లేని వైసీపీ నేతల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.’ అని అన్నారు.