SRH ఓటమి.. కెప్టెన్ కమిన్స్‌ కీలక వ్యాఖ్యలు

75చూసినవారు
SRH ఓటమి.. కెప్టెన్ కమిన్స్‌ కీలక వ్యాఖ్యలు
IPL-2025లో భాగంగా గురువారం KKRతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 80 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై SRH కెప్టెన్ కమిన్స్‌ వ్యాఖ్యలు చేశారు. తమ ఫీల్డింగ్‌ వైఫల్యమే కొంపముంచిందని అన్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఫర్వాలేదు కానీ, మైదానంలో ఇంకాస్త చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు వదిలేయడం మమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టిందని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్