బిమ్‌స్టెక్ సదస్సు కోసం థాయ్‌లాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కీలక ప్రతిపాదన చేశారు. ఈ దేశాల మధ్య చెల్లింపు వ్యవస్థలతో UPI అనుసంధానం కోసం పిలుపునిచ్చారు. ఈ చర్యతో సభ్యదేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం, పర్యటకం వృద్ధి చెందుతాయని వ్యాఖ్యనించారు. అలాగే బిమ్‌స్టెక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.