తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి అల్టిమేటం జారీ

65చూసినవారు
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి అల్టిమేటం జారీ
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయనపై పలు ఫిర్యాదులు రావడంతో ఇటీవలె క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. అయితే తాజాగా తిరువూరు ఎస్సై సత్యనారాయణను సస్పెండ్ చేయాలని విజయవాడ సీపీకి అల్టిమేటం జారీ చేశారు. ఓ మహిళ ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు రాగా సదరు ఎస్సై ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో ఆ ఎస్సైను సస్పెండ్ చేయాలని లేకపోతే స్టేషన్ ముందు ధర్నాకు దిగుతానని అల్టిమేటం జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్