AP: ఈ నెల 8న పీఎం మోదీ విశాఖ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్ లో మంత్రులు, అధికారులతో మంత్రి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి మోదీ పర్యటనను విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులను ఆయన కోరారు. 'NDA ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రధాని ఏపీకి వస్తున్నారు. ఇదొక చరిత్రాత్మక పర్యటన కాబోతుంది' అని ట్వీట్ చేశారు. సభాస్థలిని, ఏర్పాట్లను పరిశీలించారు.