AP: పశ్చిమగోదావరి జిల్లాలో రేపు మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. సోమవారం ఉ. 7.30 గం.కు తాడేపల్లిలోని ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ఉ. 11.45 గం.కు భీమవరం మండలంలోని ఎస్ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. ఆ తర్వాత మ. 12.40 గంటలకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నివాసానికి చేరుకోని, కార్యకర్తలతో సమావేశమవుతారు.