పలు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖ ఓ కీలక ప్రకటన చేసింది. దక్షిణ మధ్య రైల్వే శాఖ మూడు రోజుల పాటు పలు మార్గాలలో నడిచే ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. నేటి నుంచి అంటే ఆగస్టు 17 నుంచి తిరుపతి-కాచిగూడ, కాకినాడ టౌన్-సికింద్రాబాద్, సికింద్రాబాద్- కాకినాడ టౌన్, నర్సాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-నర్సాపూర్ వెళ్లే రైల్లు అందుబాటులో ఉండవని రైల్వే శాఖ తాజాగా పేర్కొంది.