రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ లైట్లు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడ నుంచి వచ్చాయి? వాటిని మొదట ఎవరు కనిపెట్టారో తెలుసా..? ట్రాఫిక్ లైట్ ఆలోచన 1868లో లండన్ నుంచి వచ్చింది. అప్పట్లో గుర్రాలు, బగ్గీలు, ఏస్‌లతో రోడ్లన్నీ నిండిపోవడంతో వీటి ఏర్పాటు ఆలోచన చేశారు. అయితే, మొదటి ట్రాఫిక్ లైట్ 1868లో లండన్‌లోని రైల్వే క్రాసింగ్‌లో ఏర్పాటు చేశారు.