బిగ్ బాస్-8 సీజన్‌కు ముందు వరకు నబీల్ అఫ్రీది పేరు చాలా మందికి తెలియదు. హౌస్‌లో అతను అడుగుపెట్టినప్పుడు కూడా అతనిపై పెద్దగా అంచనాలు లేవు. కానీ షో సాగే కొద్దీ నబీల్ తన ఫెర్ఫార్మెన్స్‌తో ఓటింగ్‌లో టాప్ లోకి దూసుకెళ్లినా మూడో స్థానంతో సరిపెట్టకున్నాడు. అయితే టైటిల్ గెలవకపోయినా అఫ్రిదీ రెమ్యునరేషన్ గట్టిగానే అందుకున్నాడని తెలుస్తోంది. మొత్తమ్మీద 15 వారాలకు గానూ రూ.30 లక్షల పారితోషికం అందుకున్నట్లు సమాచారం.