తిరుపతి రూరల్ మండలంలోని పద్మావతి పురం శ్రీనివాసపురం గ్రామపంచాయతీ పరిధిలో జడ్పీ హైస్కూల్ ఈశాన్యం మూలన ఉన్న గంగమ్మ దేవాలయం లోని గంగమ్మ జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది గ్రామస్థులందరూ భక్తిశ్రద్ధలతో అంబల్లు, పొంగళ్ళు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు ప్రత్యేకంగా 12 కేజీల చందనముతో అమ్మవారి ముఖప్రతిమను ఏర్పాటు చేసి అమ్మవారి దివ్య దర్శనం కలిగించినారు గ్రామ పెద్దలు అందరూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.