తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేశారు. వేద పండితుల మంత్రాలు, మంగళ వాయిద్యాలు, ఋత్వికుల ప్రత్యేక పూజలు నడుమ ధ్వజస్తంభం ప్రతిష్టాపన విజయవంతంగా జరిగింది. గురువారం విజయ గణపతి హోమం, కలశ ప్రతిష్టాపన, ధ్వజస్తంభం ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేశారు. ఆలయం వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.