ఏఆర్ పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 37 అర్జీలు అందినట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఇందులో చీటింగ్ -2, కుటుంబ తగాదాలు-8, వేధింపులు-2, ఇంటి తగాదాలు-2, భూ తగాదాలు-16, డబ్బు తగాదాలు-4, ఆస్తి తగాదాలు-3 అర్జీలు అందాయన్నారు. తక్షణం సంబంధిత అధికారులు అర్జీలను సమగ్ర విచారణ జరిపి పరిష్కరించాలని ఆదేశించారు. డీఎస్పీ సాయినాథ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.