ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గురువారం చిత్తూరు పర్యటనలో భాగంగా బిజేపీ సీనియర్ నేత చిట్టిబాబు గృహాన్ని సందర్శించారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. బిజెపి జిల్లా నాయకులు మంత్రిని కలిసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. నాయకులు కోలా ఆనంద్, మైందల రామచంద్రుడు, రామ్, భద్ర తదితరులు పాల్గొన్నారు.