తిరుపతి సంస్కృత పీఠంలో గంజాయి కలకలం వార్త బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ శనివారం తెలిపారు. ఆయన చిత్తూరులో మాట్లాడారు, విద్యార్థులు గంజాయికి బానిస కావడంతో విద్యావ్యవస్థ ఎటు పోతుందో అని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో వార్త రావడంతో ప్రపంచానికి ఈ విషయం తెలిసిందని, లేకుంటే వైస్ ఛాన్స్లర్లు, రిజిస్ట్రార్ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. వారిని రీ కాల్ చేయాలని డిమాండ్ చేశారు.