రాసనపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ సారా ధ్వంసం: ఎస్సై రామ్మోహన్ హెచ్చరిక

68చూసినవారు
రాసనపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ సారా ధ్వంసం: ఎస్సై రామ్మోహన్ హెచ్చరిక
గుడిపాల మండలంలోని రాసనపల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం 1500 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేసినట్లు గుడిపాల ఎస్సై రామ్మోహన్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అక్రమ నాటు సారా, కర్ణాటక మద్యం, గంజాయి తదితర అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు దాడులు నిర్వహించామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్