సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం బుధవారం ఉదయం విజయవాడలోని 16 వ వార్డు పరిసర వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, బాధితుల బాగోగులను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి అవసరమైన నిత్యావసరాలను అందించి నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారికి భరోసా కల్పించారు.