సివిల్ సప్లయిస్ హమాలీల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజ్ మంగళవారం డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. హమాలీల వేతన రేటును పెంచాలని గత 11 నెలలుగా డిమాండ్ చేస్తున్న అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. వారికి పని ఒత్తిడి తగ్గించి, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కూడా కల్పించాలని డిమాండ్ చేశారు.