చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజులలో ప్రజల కోసం చేసిన కార్యక్రమాలను తెలియజేసే కరపత్రాలను పంచి పెడుతూ ముందుకు సాగుతున్నారు. రాబోవు రోజుల్లో చేసే అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తున్నారు.