పెనుమూరు మండల సీనియర్ పాత్రికేయుడు శివశంకర్ (55) బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెల్లవారుజామున మూడు గంటల 35 నిమిషాల సమయంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు ఆయన భౌతికాయానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దీనితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.