ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు అసంబద్ధమైన తీర్పు ఇచ్చిందని. ఇది తమకు చీకటి రోజని టీచర్ చలపతిరావు అన్నారు. శుక్రవారం కార్వేటినగరం మండల కేంద్రంలో పలువురు దళితనాయకులు సమావేశమయ్యారు. అన్నదమ్ములుగా ఉన్న దళితుల మధ్య చిచ్చు రేపడం సరికాదు. వర్గీకరణ నిలిపివేయాలని కోరుతూ 21వ తేదీ జరిగే బంద్ లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు కోరారు. దొరబాబు, ఆదాం, ఏకాంబరం, సోమశేఖర్, మురళి, కిరణ్ లు పాల్గొన్నారు.