చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు.