నెల్లూరు జిల్లాలోని సీతారామపురం, ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు మండలాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. పంటల సాగు, ఎరువుల వాడకం, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు యాజమాన్య పద్ధతులు పాటించడం వలన అధిక దిగుబడి పొందవచ్చనని తెలిపారు. సాగు చేసిన పంటలో చీడపీడలు గుర్తించినట్లయితే వ్యవసాయ శాఖ అధికారి దృష్టికి తీసుకువచ్చి ముందులు వాడాలన్నారు.