ఘనంగా శ్రీ వరలక్ష్మీ వ్రతం పూజా కార్యక్రమం

62చూసినవారు
ఘనంగా శ్రీ వరలక్ష్మీ వ్రతం పూజా కార్యక్రమం
దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గాభవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. దేవస్థానం ఆలయ ఆవరణలో వరలక్ష్మీ వ్రతం పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మహిళా భక్తులు ఈ పూజకు అధిక సంఖ్యలో విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్